రేషన్ కార్డు ప్రయోజనాలు అందరకి తెలిసినవే. దారిద్య్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగిన లబ్ధిదారుల రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే ఆహార ధాన్యాలు, బియ్యం, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే.. తక్కువ ఆదాయం కలిగిన వారికి బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది.