Mr.. రాము హీరో., తో  ఫిలిం బండి  మాట ముచ్చట్లు  

 బండి...మీరు హీరో ఎలా వచ్చారు 

 రాము..ఆటోలో వచ్చాను 

బండి. నేను అడిగింది ఆటోలో వచ్చావా బైక్ మీద వచ్చావని కాదు హీరోల కావాలని ఎందుకు అనిపించింది.

రాము. చాలా బాగుంటానని నేను చాలా అందంగా ఉన్నానని నాకంటే స్మార్ట్ గా ఎవరు లేరని మహేష్ బాబు కంటే నేను చాలా అందగాడిని అని చెప్పేసి అనిపించింది అందుకే హీరో కావాలనుకున్నాను 

బండి. నీకు చాలా వెటకారాలు ఎక్కువ అనుకుంటాను

రాము. నాకు కారాలు మిర్యాలతో పాటు చమత్కారాలు కూడా చాలా ఎక్కువ 

 బండి.. సూటిగా సమాధానం చెప్పు నువ్వే పెద్ద సూపర్ స్టార్ లాగా బిల్డప్ ఇవ్వదు 

రాము. నేను సూటిగా నే చెప్తున్నాను నీకే సక్కగా ఎక్కట్లేదు 

బండి. మీ డైరెక్టర్ అజయ్ కౌండిన్య కీ బాగా కోపం ఎక్కువ అంట నిజమేనా 

రాము. మా డైరెక్టర్ ఒక సినిమా పిచ్చోడు. సినిమాలోకం తప్ప ఏమి తెలియదు 

 బండి.సరేగాని నువ్వు హీరో అవ్వాలనుకున్నప్పుడు నీ మొహం నువ్వు అద్దంలో చూసుకున్నావా 

రాము.. నాకేంటి తెలుగు ఇండస్ట్రీ అందరి హీరోల కంటే  నేను చాలా అందంగా ఉంటాను అందుకే హీరో అవ్వాలనుకున్నానని ముందే చెప్పాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ అలా  అడుగుతావు.

బండి. నువ్వు చూస్తే ఏదో బుద్ధిమంతులాడీలా కనిపిస్తావు గాని చాలా తింగరోడివే.

రాము. ఓ మీకు ఇప్పుడు అర్థమైందా ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు నేను పుట్టినప్పటినుంచి మా అమ్మ నువ్వు పెద్ద తింగర నా కొడుకు వని ఎప్పుడో చెప్పింది.

 బండి.సరేగాని మీ ప్రొడ్యూసర్ పేరేంటి 

రాము.. రేణుకా దేవి గారు

బండి. ఈ విషయం మాత్రం సక్కగా సూటిగా సుత్తి లేకుండా చెప్పావు ఆమె అంటే భయమా లేదంటే భక్తి..

రాము.. కాదు ప్రేమ.