అజయ్ ఘోస్ గారి తోటి నేను రీసెంట్లీ రేణుకాదేవి ఫిలిమ్స్ బ్యానర్ లో మిస్టర్ రాము అనే సినిమాకి వర్క్ చేశాము 


 అజయ్ ఘోస్, గారి తోటి నేను సినిమా చేయాలని చెప్పేసి నేను ఎన్నో రోజుల నుంచి  ట్రై చేశాను మొదటగా కలవడానికి  చాలా ఇబ్బంది అయింది ఆ తర్వాత ఒకరోజు అనుస్పెక్టెడ్ గా ఆయన మీద నాకు ఉన్న ప్రేమతో ఆయనే నాకు రోడ్డుపైన కలిశాడు ఆరోజు ఆయన పోతున్నటువంటి  స్కూటీ పైన కామన్ వెళ్తున్నాడు వెహికల్ ఆపేసి నెంబర్ తీసుకుని మాట్లాడాను. ఆయన లో ఉన్న ఆర్టిస్ట్ ని నా సినిమాలో కచ్చితంగా  పెట్టాలని చెప్పేసి నేను చాలా వెయిట్ చేశాను అనుకోకుండా రేణుకాదేవి ఫిలిమ్స్ లో మిస్టర్ రాము అనే పిక్చర్ కి నేను ఆయనని కలిసి కథ చెప్పాను కథకు ఒప్పుకున్నాడు చాలా బాగుంది కౌండిన్య నువ్వు చెయ్యి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చెప్పి ముందుకు సపోర్ట్ చేశాడు అదేవిధంగా షూటింగ్ డేట్  ఫిక్స్ అయ్యాయి కానీ. కౌండిన్య నేను రవితేజ గారి షూటింగ్లో బిజీ ఉన్నాను. ఒక టెన్ డేస్ తర్వాత మీ షెడ్యూల్ పెట్టుకొండి అని చెప్పాడు కానీ అదృష్టం అంటే కలిసి వచ్చిందేమో అనుకున్నట్టుగా ఆ రోజు నైట్ మళ్ళీ ఫోన్ చేసి కౌండిన్య రేపు ఎల్లుండి టుడేస్ నేను మీ గురించి వస్తాను అని చెప్పాడు నేను చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ తోటి సడన్లే ఏలాంటి ప్లాన్ లేకుండా షూటింగ్ చేయాలంటే చాలా కష్టమైన విషయం. అప్పటికప్పుడు  మేము చుసిన లొకేషన్ కొంచెం ఇబ్బంది అయింది ఆయన కీ చెప్పాను సార్  లొకేషన్ ప్రాబ్లం అయింది టైం పడుతుంది సార్ అంటే పర్లేదు మీరు  సెట్ చేసుకొండి మళ్ళీ నెక్స్ట్ డేకు టైం ఇచ్చాడు షూటింగ్స్ కు వచ్చిన తర్వాత మా టీంలో ఉన్న వాళ్ళందరూ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కొత్తవాళ్లు అజయ్ ఘోస్ గారిని చుస్తే చాలా హ్యాపీ గా  ఫీల్ అయ్యాము, చూస్తే కామన్ మ్యాన్ గా కాదు కంత్రి లా ఉన్నాడు ఏంట్రా బాబు అనుకున్నారు అందరు, కానీ లొకేషన్ లోకి వచ్చిన తర్వాత.. ఆయన ఫ్రీడమ్ కీ అందరు ఘోస్ మామ అనుకునేవాళ్ళము,ఆయన డెడికేషన్ 7:00 వస్తానని చెప్పాడు కరెక్ట్ 7:00 లొకేషన్ లో ఉన్నాడు మేకప్ రెడీ చేసుకున్నాడు మాకు లొకేషన్ లో కూడా కొన్ని కాస్ట్యూమ్స్ ప్రాబ్లం అయింది ఎందుకంటే మేము ఆయనకి తీసుకొచ్చినటువంటి కాస్టమ్స్ ఆయనకు సరిపోలేదు తర్వాత ఆయన పర్సనల్ కాస్టమ్స్ అన్ని రెడీ చేసుకుని మీరు భయపడొద్దు మీరు చేసేసుకోండి ప్రాబ్లం లేదు నేను కాస్ట్యూమ్స్ నేనే రెడీ చేసుకుంటానని చెప్పేసి ఆయన కాస్ట్యూమ్స్ ఆయన్ని రెడీ చేసేసుకొని కెమెరా ముందుకు వచ్చేసాడు ఫస్ట్ ఆయన పైన నేను యాక్షన్ చెప్పడం నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే పుష్ప లాంటి పెద్ద సినిమాలో యాక్టింగ్ చేసినటువంటి ఒక స్టార్ తోటి నేను పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అదేవిధంగా నా కావలిసినటువంటి ప్రతి సీన్ కి ప్రతి షార్ట్ కి ఆయన చాలా సపోర్ట్ చేశాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మొదటగా ఆయన నేను కెమెరా ముందు పెట్టుకొని  ఘోస్ గారి కటౌట్ మానిటర్ లో చూస్తే  నేను చాలా సంతోష పడ్డాను ఎందుకంటే నాకు నచ్చిన ఆర్టిస్ట్ తో చేస్తున్నాని,  కానీ ఆయన  కండ్లు పెద్దదిగా చేస్తే చాలు పెద్ద డాన్ లాగ కనిపిస్తాడు నిజం చెప్పాలంటే చాలా సున్నితమైనటువంటి వ్యక్తి పక్క ప్రొఫెషనల్ ఆర్టిస్టు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తాడంటే,ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటే లొకేషన్ లో కావచ్చు, ప్రొడ్యూసర్స్ కి కావచ్చు ఆయన సపోర్టు చాలా బాగుంటుంది షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన డబ్బింగ్ కి వచ్చినప్పుడు కూడా   ఆయన ఎంకరేజ్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. కొత్తగా వచ్చే డైరెక్టర్లు అందరికీ అజయ్ గోష్ లాంటి వారిని పెట్టుకుంటే సినిమాకు మంచి పేరు వస్తుంది దాంతోపాటు మంచి కటౌట్ మనం వాడుకున్నట్టు ఉంటుంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఆయనని టేకప్ చేసుకోగలిగినట్లు అయితే వారి యొక్క సినిమాకు ఒక మంచి పేరు వస్తుంది కథకు తగ్గ క్యారెక్టర్ సరిపోతుందని  నా ఒపీనియన్... డైరెక్టర్ అజయ్ కౌండిన్య..