నిప్పుల వెనక నిపుణుడు: కాల్చిన చికెన్‌తో కలలను పండిస్తున్న రాంచరణ్!
గట్టు ఇప్పలపల్లి, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా… ఈ పేర్లు ఎవరికైనా చిన్న ఊర్లలా అనిపించవచ్చు. కానీ ఈ చిన్న ఊరిలో పెద్ద కలలతో ఉన్న యువకుడు ఒకడు ఉన్నాడు, రాంచరణ్.చదువులో అవకాశాలు లేక, పని కోసం పట్టణాలకు వెళ్ళాలంటే చేతిలో సాయం లేదు. కానీ ఓ చిన్న ఆశ మాత్రం ఉండేది .ఊరంతా నా పేరు వినాలి. నా చేతులు కాల్చిన చికెన్ వాసన ఎంత దూరం వెళ్లాలో చూడాలి!"సొంతంగా సేకరించిన ₹1500తో మొదలైంది అతని ప్రయాణం. చెక్క గడ్డి గిన్నెలు, మసాలాలు, బండీ… ఏది చిన్నదైనా, ఆ ఆశ మాత్రం పెద్దది. మొదటి రోజులు తక్కువ అమ్మకాలు, తక్కువ ఆదాయం, కానీ పట్టుదల మాత్రం ఎక్కువగా.ఇప్పుడు కల్వకుర్తి పట్టణం ఊపు ఊపుతుంది..ఒకరు ఎలాంటి మద్దతు లేకుండా, ఊరిలోనే నిలబడితే — అతను అసలైన యువ నాయకుడు,"ఈ రోజు, కల్వకుర్తి మహబూబ్నగర్ చౌరస్తాలో ప్రజల బాగోగులు చూస్తున్నది ఒక చిన్న చికెన్ షాప్ కాదు…ఒక యువకుడి ఆత్మవిశ్వాసం, పోరాటం, గర్వం.రాంచరణ్ ఫైర్ చికెన్" ప్రతి ప్లేట్ వెనక మంట లేదు... పట్టుదల ఉంది! రాంచరణ్ నిప్పులతో కాల్చిన చికెన్ విక్రయిస్తున్నాడు…
కానీ ఆ మంటల మధ్య ఒకటి కాలిపోవడం లేదు —అతని కలలు
- .....Ajay Koundinya