బైరి నరేష్ – మూఢనమ్మకాలపై యుద్ధం చేసిన నాస్తిక యోధుడు
తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన, హేతువాద భావజాలాన్ని బలంగా ప్రోత్సహిస్తున్న పేరు – బైరి నరేష్. సమాజంలో దాగి ఉన్న అజ్ఞానం, భయాలు, తప్పుడు ఆచారాలు, మతపరమైన అంధ విశ్వాసాలను బహిరంగంగా సవాలు చేసే ధైర్యం అతనికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. చిన్ననాటి ప్రేరణ హనుమకొండ జిల్లా రాములపల్లి గ్రామంలో పుట్టిన నరేష్, చిన్నప్పటి నుంచే తన తండ్రి ద్వారా హేతువాద ఆలోచనలకు పరిచయం అయ్యాడు. మూఢనమ్మకాలు మనిషి బానిసత్వానికి కారణం అన్న సత్యాన్ని చిన్న వయసులోనే గ్రహించాడు. గ్రామాల్లో కనిపించే జాతకాలు, మంత్రాలు, భూతాలు, శకునాలు వంటి తప్పుడు నమ్మకాలను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మూఢనమ్మకాలపై బహిరంగ పోరాటం బైరి నరేష్ నమ్మకం – “జ్ఞానం ఉన్న చోట మూఢనమ్మకం ఉండదు. అజ్ఞానాన్ని తొలగించాలి అంటే, సత్యం చెప్పడమే మార్గం.”గ్రామాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి శాస్త్రీయ ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్లాడు."మంత్రం, తంత్రం, శకునం – ఇవన్నీ మనసుకు భయాన్ని నింపే ఆయుధాలు మాత్రమే" అని బహిరంగంగా ప్రకటించాడు. అజ్ఞానాన్ని లాభం కోసం వాడుకునే మోసగాళ్లను ఎక్కడ చూసినా ఎత్తి చూపాడు “మూఢనమ్మకాల నిర్మూలన సంఘం” స్థాపన 2023లో తన భార్య సుజాతతో కలిసి మూఢనమ్మకాల నిర్మూలన సంఘంను స్థాపించారు.
ఉద్దేశం: తప్పుడు ఆచారాలు, మతబద్ధ అంధ విశ్వాసాలు, మంత్ర-తంత్రాల మోసాల నుంచి ప్రజలను రక్షించడం. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం.
వివాదాల మధ్య ధైర్యం ;మతపరమైన మూఢనమ్మకాలపై బహిరంగ విమర్శలతో ఆయనపై పలు కేసులు, అరెస్టులు జరిగాయి.
కానీ నరేష్ వెనక్కి తగ్గలేదు. “సత్యం చెప్పేవాడికి శత్రువులు ఎక్కువే… కానీ చరిత్ర అతని పక్షానే ఉంటుంది” అని నమ్మి ముందుకు సాగుతున్నాడు. సమాజంపై ప్రభావం యువతలో తార్కిక ఆలోచన పెంచడం.భయానక ఆచారాల కంటే శాస్త్రీయ పరిష్కారాలపై నమ్మకం పెంచడం. గ్రామీణ ప్రాంతాల్లో మోసపూరిత ఆచారాలను తగ్గించడం. బైరి నరేష్ – మౌనంగా ఉండే సమాజంలో సత్యం గర్జించే స్వరం.
అతని లక్ష్యం ఒక్కటే – “తెలుగు నేలపై మూఢనమ్మకాలకు శాశ్వతంగా ముగింపు.”
Ajay Koundinya .MA LLB,
Film Director